Friday, December 20, 2024

జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భం జిల్లాలో సోమవారం రాత్రి మావోయిస్టులతో జరిగిన కార్పుల పోరులో రాష్ట్ర పోలీసు శాఖలోని జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

టోంటో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో అమిత్ తివారీ, గౌతమ్ కుమార్ అనే ఇద్దరు జవాన్లు మరనించినట్లు పశ్చిమ సింగ్‌భం ఎస్‌పి అశుతోష్ శేఖర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావలసి ఉందని ఆయన చెప్పారు. అదే ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం మావోయిస్టులతో జరిగిన కాల్పుల పోరులో ఒక సిఆర్‌పిఎఫ్ జవాను మరనించగా మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News