Tuesday, November 5, 2024

రాజద్రోహానికి పాల్పడిన ఇద్దరు జోర్డాన్ అధికారులకు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Two Jordanian officials jailed for treason

 

అమ్మన్(జోర్డాన్): రాజద్రోహానికి పాల్పడినందుకు ఇద్దరు మాజీ అధికారులకు జోర్డాన్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కింగ్ అబ్దుల్లా 2 వద్ద గతంలో అత్యున్నత అధికారిగా పనిచేసిన బస్సెమ్ అవాడల్లా, రాజకుటుంబ సభ్యుడైన షరీఫ్ హసన్ బిన్ జెయిద్‌లకు రాజద్రోహం, కుట్రలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరికీ 15 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించింది. అవాదల్లాకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. వీరిద్దరూ జోర్డాన్ రాజు సోదరుడు ప్రిన్స్ హంజాతో కలసి కుట్రపన్నారని, ఇందుకు విదేశీ సాయాన్ని కూడా కోరారని అభియోగాలు నమోదయ్యాయి. గోప్యంగా జరిగిన కోర్టు విచారణ అనంతరం సోమవారం తీర్పు వెలువడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News