Friday, November 15, 2024

ఢిల్లీలో కాలా జాతేడీ గ్యాంగ్ షూటర్లు ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఘరానా షూటర్ల కాలాజాతేడీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షూటర్లను ఢిల్లీ లోని దుల్ సిరాస్ ఏరియాలోఆదివారం పోలీస్‌లు అరెస్టు చేశారు. స్వల్పంగా ఎదురు కాల్పులు జరిగిన తరువాత ఈ అరెస్టు జరిగింది. నిందితులు వికీ ( 26). నరేందర్ (24) హర్యానా లోని సోనీపట్ కు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి అత్యంత ఆధునిక పిస్టల్స్, ఐదు తూటాలు పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వీరిద్దరూ ఎవరో ఒకరిని హతమార్చడానికి ద్వారకకు వస్తున్నట్టు పోలీస్‌లకు సమాచారం అందింది. పోలీస్‌లు ధుల్ సిరాస్ చౌక్‌కు చేరుకుని గాలింపు చేపట్టారు. చావ్లా డ్రయిన్ రోడ్డు మీదుగా మోటార్ బైక్‌పై ధుల్ సిరాస్ వైపు వస్తున్న వీరిని పోలీస్‌లు ఆపడానికి ప్రయత్నించగా, తప్పించుకోవాలని చూశారు. ఈ సమయంలో బైక్‌పై నుంచి పడిపోయి పోలీస్‌లపై కాల్పులు ప్రారంభించారు. పోలీస్‌లు ఎదురు కాల్పులు సాగించి వారిని చివరకు పట్టుకోగలిగారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( క్రైమ్ ) రవీంద్రసింగ్ యాదవ్ చెప్పారు.

ఎవరినో ఒకరిని చంపుతామని బెదిరించి డబ్బులు గుంజడం కాలా జాతేడీ గ్యాంగ్ పని. ఇదే గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు గత జనవరి 30న ద్వారక లోని రామ్‌ఫల్ చౌక్‌లో రియల్ ఎస్టేట్ డీలర్‌ను తుపాకీతో బెదిరించి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. మళ్లీ జులై 31న ఆ రియల్ ఎస్టేట్ డీలర్‌కు వారి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. వికీ, నరేందర్‌తోపాటు నరేష్ సేధీ అనే గ్యాంగ్ కలిసి డీలర్ ఇంటికి వెళ్లి కాల్పులు జరిపారని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News