Friday, November 8, 2024

పసికందు కడుపులో పిండం.. సర్జరీతో తొలగింపు

- Advertisement -
- Advertisement -

లక్నో : ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉండగా డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లా కుంట ప్రాంతానినకి చెందిన రైతు భార్య కొన్ని నెలల కిందట ఒక బాబుకు జన్మనిచ్చి చనిపోయింది. ప్రస్తుతం ఏడు నెలల వయసున్న ఆ పసికందు కడుపు ఉబ్బెత్తుగా ఉండడంతో కడుపు నొప్పి తరచుగా వస్తూ బాబు అల్లాడి పోయేవాడు. ఈనెల 24న తండ్రి ఆ పసికందును స్వరూప్‌రాణి నెహ్రూ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు.

సిటీ స్కాన్‌లో పసికందు కడుపులో పిండం పెరుగుతున్నట్టు వైద్యులు తెలుసుకున్నారు. ప్రయాగ్‌రాజ్ లోని సరోజినీ నాయుడు పిల్లల ఆస్పత్రి డాక్టర్లు కూడా దీనిని నిర్ధారించారు. దీంతో డాక్టర్ కుమార్ నేతృత్వం లోని వైద్యుల బృందం సర్జరీ చేసి పిండాన్ని తొలగించింది. నాలుగు గంటల పాటు సర్జరీ జరిగింది. తల్లి గర్భంలో కవలలు ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక పిండం కవల పిల్ల కడుపులో పెరుగుతుందని డాక్టర్ కుమార్ తెలిపారు. వైద్యపరంగా దీన్ని ఫీటస్ ఇన్ ఫీటూ అని వ్యవహరిస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News