Monday, December 23, 2024

నిలోఫర్ ఇద్దరు చిన్నారులకు కరోనా

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులకు తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడం కుటుంబసభ్యులు అనుమానంతో నిలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. వారికి కోవిడ్ సోకిందని ఆస్పత్రి వైద్య వర్గాలు నిర్ధారించాయి. ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి జ్వరం, దగ్గు, ఆయాసం తదితర సమస్యలతో బాధపడుతుండగా అనుమానం కలిగిన కుటుంబసభ్యులు భయాంధోళనలతో మెరుగైన చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో ఆడ్మిట్ చేశారు. చిన్నారికి వివిధ పరీక్షలు చేయగా కోవిడ్ సొకిందని వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులో పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదేవిధంగా శామీర్‌పేట్ సమీపంలోని తూంకుంటకు చెందిన రెండు నెలల పసికందు మూడు రోజుల క్రితం నిమోనియా, ఇతర సమస్యలతో బాధపడుతోంది.

కుటుంబ సభ్యులు అనుమానంలో హుటాహుటిన నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పసికందుకు వివిధ పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకిందని వైద్యులు గుర్తించారు. ఆ చిన్నారిని ప్రస్తుతం ఆస్పత్రి ప్రత్యేక కోవిడ్ వార్డులో అక్సిజన్‌తో అందిస్తున్నారు. చిన్నారికి అన్ని రకాల అవసరమైన చికిత్సలు అందిస్తున్నామని, నిరంతరం పరిస్థితిని వైద్యులు దగ్గరుండి పరిశీలిస్తున్నారని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతి తెలిపారు. కాగా, ఏడాదిన్నర కాలంగా పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్న కోవిడ్ మళ్లీ వ్యాపించడం జనాన్ని తీవ్ర భయాందోనళకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News