Monday, December 23, 2024

నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్‌లో దారుణం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో ఎసి సిలిండర్‌ను మారుస్తుండగా సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన నల్లగొండ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు… నల్లగొండ బర్కత్ పుర కాలనీలో న్యూస్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో ఫ్రూట్స్‌ను మగ్గబెట్టేందుకు ఏర్పాటు చేసిన రూంలో ఏసి గ్యాస్ సిలిండర్‌ను మారుస్తున్న క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్టోరేజీ కంపెనీ ఓనర్ షేక్ కలీం (44), అక్కడ పనిచేస్తున్న ఆటో డ్రైవర్ సాజిద్ (41) ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆ పేలుడు ధాటికి ఇరువురి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో మృతి చెందిన వారిద్దరితో పాటు మరో ఇద్దరు కొంత దూరంలో కంపెనీ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

అయితే ఈ పేలుడు ఆ రూం వరకే తీవ్రత ఉండటంతో మరో ఇద్దరికి ఏమి కాకుండా బయటపడ్డారు. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్ధ రావటంతో అక్కడ పని చేస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో తెగిపోయిన ఇరువురి శరీర భాగాలు కంపెనీలో వేర్వేరు ప్రాంతాలలో పడిపోవడంతో ఆ ప్రాంతమంగా భీతావాహాంగా మారింది.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి పూర్తి వివరాలను తెలసుకున్నారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న వారితో మృతదేహాల భాగాలను ఒక పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన వ్యక్తి కలీం భార్య ఫిర్యాదు పై కేసు నమోదు చేశామని సిఐ రౌత్ గోపి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News