Monday, December 23, 2024

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని తునికి గేటు సమీపాన శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్ తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన దోహి (26), సరోజ్(30), కన్నయ్యలాల్ ముగ్గురు వ్యక్తులు రెడ్డిపల్లి గేటు వద్ద సిమెంట్ పనులు చేస్తుంటారు. వీరు ముగ్గురు యాక్టివా వాహనంపై వెంకట్రావుపేట్ వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొని రెడ్డిపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.

తునికి గేటు సమీపానికి రాగానే నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న యాక్టివాను ఢీకొనడటంతో దోహి, సరోజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కన్నయ్యలాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ షేక్ లాల్ మదర్ తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News