Saturday, December 21, 2024

కారు బోల్తా.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సిఐ సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన సాయి తేజ, మట్టెవాడ ప్రాంతానికి చెందిన పాక లక్ష్మణ్, సంగినేని సాయిరాం, వెంగళదాసు సాయిరాం, గుగ్గిళ్ల రవితేజ ఐదుగురు కలిసి వరంగల్ నుంచి మారేడుమిల్లికి వెళ్లేందుకు కారులో సోమవారం రాత్రి బయల్దేరారు. ఈ క్రమంలో మహబూబాబాద్ పట్టణ శివారు ఏటిగడ్డతండా సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడింది.

దీంతో తీవ్ర గాయాలైన వారిలో వెంగళదాసు సాయిరాం (27), గుగ్గిళ్ల రవితేజ (29)లు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా సంగినేని సాయిరాం, పాత లక్ష్మణ్, సాయితేజలకు తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అలాగే ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి చేర్చిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News