Wednesday, December 25, 2024

గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మిడ్జిల్ : గుర్తు తెలియని వాహనం స్కూటిని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వాడ్యాల మున్ననూరు గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది.రూరల్ సిఐ జమ్ములప్ప మిడ్జిల్ ఎస్‌ఐ రాంలాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… జడ్చర్లపట్టణం ఇంద్రనగర్‌కు చెందిన నాగార్జున (25), చెన్నయ్య (37) , జడ్చర్ల మున్సిపాల్టీలో శానిటరీ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు.

చెన్నయ్య మిడ్జిల్ మండలంలో ఉన్న బం ధువుల వద్దకు తన తోటి కార్మికుడైన నాగార్జునను స్కూటిపై తీసుకువెళ్లి తిరుగు ప్రయాణం అవుతుండగా మిడ్జిల్ మండల పరిధిలోని వాడ్యాల మున్ననూరు గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం స్కూటిని బలంగా ఢీ కొనడంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న చెన్నయ్యను 108లో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు మిడ్జిల్ ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News