Monday, December 23, 2024

లారీ బైక్ ఢీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్‌: లారీ, బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఖేడ్ నియోజకవర్గ నూతన నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలోని 161 జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం నూతన నిజాంపేట్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్దరాత్రి లారీ ఆర్‌జే09 జిబి 6256 పిట్లం నుంచి వెళ్తుంది. పెద్దశంకరంపేట నుంచి టీఎస్09 ఈఎఫ్8254 నెంబరు గల బైక్‌పై భూర్ల జీవయ్య(51), కమ్మరి నాగభూషణం(45) వస్తుండగా ఎదురెదురుగా ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో ఒకరు టేక్మాల్ మండల ఎల్లుపేట్‌కు చెందిన కమ్మరి నాగభూషణం, పెద్దశంకరంపేట మండల జూకల్ గ్రామానికి చెందిన గుండ్రని శివయ్యలు అన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జీవయ్య భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News