Thursday, January 23, 2025

బ్రిడ్జిపై నుంచి బొలెరో వాహనం బోల్తా: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దమందడి:  పెద్దమందడి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై నుంచి బుర్రవాగు స్టేజి దగ్గర సోమవారం బొలెరో వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి వాగులోకి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పెద్దమందడి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. పోలీసు వారు తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపి 39 టిఎస్ 8761 నెంబర్ గల బొలెరో వాహనం కర్నూల్ వైపు వెళ్తుండగా వెల్టూరు దాటాక బుర్రవాగు బ్రిడ్జి దగ్గర అదుపుతప్పి వాగులో పడిపోయింది.

ఈ సంఘటనలో ఎల్‌ఎన్టి రోడ్డు పని చేస్తున్న కనిమెట్ట గ్రామానికి చెందిన మల్లమ్మకు కాలు విరగగా, బొలెరో బండిలో ప్రయాణిస్తున్న కూరగాయల వ్యాపారులు 5 మందిలో ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్‌కు పంపించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన గురించి పోలీస్ స్టేషన్‌కు ఇంకా ఎవరు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News