Sunday, January 5, 2025

పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

చిన్నకోడూరు : పెళ్లికొడుకుని చూడడానికి వెళ్తున్న కుటుంబంపై వాహనం రూపంలో మృత్యువు దాడి చేసింది. శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్న కళ్ళు మూతపడ్డాయి. ఆశలు ఆవిరైపోయాయి. ఈ విషాద ప్రమాద ఘటనలో పెళ్లి కూతురు తండ్రితో పాటు సోదరుడు దుర్మరణం చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మరో 11 మంది ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. కళ్ళు చెమరింపజేసే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని బాలాజీనగర్‌క చెందిన మరియాల శ్రీనివాస్(60), అతని కుమారుడు హన్మంత్రావు (26), కుటుంభ సభ్యులతో క లిసి కూతురుకు పెళ్లి సంబంధం చూడటానికి టాటా ఏ సీ ఆటోలో గురువారం కరీంనగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని రామునిపట్ల శివారులో వారు ప్రయాణిస్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పగిలిపోయి డివైడర్ను ఢీకొని పల్లీ కొట్టింది.

శ్రీనివాస్, అతని కుమారుడు హన్మంతరావులకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ భార్య విజయ, పెద్దకుమారుడు రమేష్. కొడలు జ్యోతి, వారి పిల్లలు జయ్, రిషికేష్‌లు ఆటో డ్రైవర్ వీర భద్రం, భార్య పావని, కుమారుడు బాబు, బంధువులు కందుకూరి లక్ష్మయ్య , సరిత, సాయికిరణ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసిపి సురేందర్‌రెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సుబాష్ గౌడ్‌లు సంఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్సలు నిర్వహించారు. తండ్రి ,కొడుకుల మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుని బార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుబాష్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News