- Advertisement -
గ్రానైట్ కూలీలపై రాళ్లు మీద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం ఖమ్మం కోదాడ నేషనల్ హైవేపై గోకినపల్లి గ్రామంలోని ఓ గ్రానైట్ క్వారీ నుంచి గ్రానైట్ రాళ్లను డిసిఎం వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా ముదిగొండ గ్రామ సమీపంలో డిసిఎం టైర్లు పగిలిపోవడంతో డిసిఎం పల్టీ కొట్టింది.ఈ ఘటనలో వాహనంలో ఉన్న కూలీలపై రాళ్లు పడడంతో ఇద్దరు ఘటన స్థలిలోనే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -