- Advertisement -
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి దంతాలపల్లి వద్ద బోరును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు లో ప్రయాణిస్తున్న డ్రైవర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవంగ్రా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకి తీసి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -