Sunday, January 26, 2025

బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

two killed in road accident in kurnool district

అమరావతి : కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లా కెసి  కెనల్ వద్ద బుధవారం రోడ్డుప్రమాదం సంభవించింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వినుకొండకు చెందిన మల్లికార్జున, నాంచారయ్యగా గుర్తించారు. అధిక వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకీ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News