- Advertisement -
ముంబై: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సూరత్ లో దేవాదాయశాఖ ఉద్యోగుల కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ వాసులు శ్రీనివాస్, రమణగా గుర్తించారు. శ్రీనివాస్ అడిక్ మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఇవోగా విధులు నిర్వహిస్తున్నారు. రమణ పాన్ బజార్ వేణుగోపాలస్వామి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. వీరు ఉత్తరాది నదీ జలాల కోసం గుజరాత్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -