Wednesday, January 22, 2025

మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళుతున్న టిఎస్ఆర్టీసీ బస్సు నెల్లూరు జిల్లా మాచర్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మృతులను బస్సు డ్రైవర్ వినోద్ (45), సీతమ్మ (65)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News