Saturday, December 21, 2024

గోడకూలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కోళ్లఫారం గోడకూలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు తీవ్రగాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం, కామారం గిరిజన తండాలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి కామారం తండా పంచాయతీలో కోళ్లఫారం నిర్మాణంలో జార్ఖండ్ రాష్ట్రం, బాస్నా గ్రామం గంజ్ వలస కూలీలు పనులు చేస్తున్నారు. సోమవారం గోడకూలింది. కూలిన సిమెంట్ ఇటుకలు యువకులపై పడడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News