శ్రీనగర్ : కశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. దక్షిణ కశ్మీర్ కుల్గామ్ లోని రెడ్‌వానీ పయీస్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భద్రతా దళాలు చేపట్టిన గాలింపు మంగళవారం వరకు కొనసాగింది. ఈ సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుపడగా, ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ అహ్మద్‌దార్, లష్కరే తోయిబాకి చెందిన మోడిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా గా గుర్తించారు. వీరంతా 18 మందిని హత్య చేశారని, అలాంటి ముష్కరులను ఎన్‌కౌంటర్ చేయడం, తమకు పెద్ద విజయమని భద్రతా బలగాలు చెప్పాయి. మే4న పూంచ్ జిల్లాలో భద్రత బలగాలను లక్షంగా చేసుకున్న దాడుల్లో భారత వైమానిక దళ అధికారి మరణించిన సంగతి తెలిసిందే.