Wednesday, April 30, 2025

ఆయిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నైరుతి పాకిస్థాన్ దుమ్ము రోడ్డులో లీకయిన ట్యాంకర్‌కు నిప్పంటుకుని పేలిపోయిన ఘటనలో ఇద్దరు చనిపోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రాంతంలోని నౌష్కీలో అగ్నిమాపక దళం వారు మంటలను ఆర్పుతుండగా ట్యాంకర్ నుండి ఆయిల్ లీకై  పేలుడు సంభవించిందని అక్కడి స్థానిక పోలీస్ అధికారి  తెలిపారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, మరొక వ్యక్తి  చనిపోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక పోలీసులు చికిత్స నిమిత్తం కరాచీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఖ్వెట్టాలోని సివిల్ హాస్పిటల్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News