Thursday, January 23, 2025

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకరు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని ఆదిభట్ల టిసిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం.. ఆదిభట్ల లోని టిసిఎస్ పరిధిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఫిటింగ్ చేస్తుండగా కరెంట్ సప్లై అయ్యి యువకుడు సంఘటన స్థలంలోనే మృతి  చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాంను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News