హైదరాబాద్: సభ్యత్వ నమోదులో కూకట్‌పల్లి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధి రాజు కాలనీ దుర్గమ్మగుడి వద్ద కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజక వర్గ శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నియోజక వర్గంలో అన్ని డివిజన్‌ల్లో ప్రారంభించుకున్నామని, ఈ నెల 25వ తేదీ వరకు సభ్యత్వ కార్యక్రమం పూర్తి చేసి రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసిన వారుగా నిలవాలని అన్నారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వ గుర్తింపు కార్డులు కూడా వస్తున్నాయని, గత సంవత్సరం నలభై వేల లక్షంగా పని చేశామని కానీ ఈ సారి యాబై వేల లక్షాన్ని చేరుకునేలా కృషి చేయాలని అన్నారు.
కార్యకర్తలు ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే ఈ కార్డ్ ద్వారా రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా ఆ కార్యకర్తను ఆదుకుంటుందని అన్నారు. కార్యకర్తలే పార్టికి పట్టు గొమ్మలని పార్టీని పటిష్ట పరిచేది కూడా వారే అని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నదని, రాష్ట్రంలో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీ పట్ల, ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారని అన్నారు. అదే విధంగా మొదటి వారంలో డివిజన్ కమిటీ, రెండవ వారంలో జిల్లా కమిటీ, ఏప్రిల్‌లో రాష్ట్ర కమిటీల నియమకం ఉంటుందని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వారివారి ప్రాధాన్యతను బట్టి పదవులు, నామినేటెడ్ పదవులు ఉంటాయన్నారు. బాలానగర్ డివిజన్ కార్పోరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నాయకత్వంలో డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చి దిద్దుతాడని, పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ల సమస్యలు ఉన్నట్లైతే వాటిని పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మందడి సుధాకర్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Two lakh accident insurance for TRS members