Monday, December 23, 2024

ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరీక్షలు నిర్వహించడం గానీ, పరీక్షా ఫలితాలను ప్రకటించడం గానీ, ఉద్యోగ నియామకపత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్‌కు ఉండాలి…చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏదీ జరగదు…ఇది న్యాయపరంగా చెల్లదు…అక్కడున్న చట్టం కూడా అనుమతించదు…ఇప్పుడున్న చైర్మన్, మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు…గతంలో గవర్నర్‌కు వచ్చిన ఫిర్యాదుల మేరకు నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడం, అవి వివిధ స్థాయిలలో పెండింగ్‌లో ఉన్నాయి…వాటిని ఒకసారి సమీక్షించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకుని వీళ్లను ఆమోదిస్తామని అన్నరు. కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించుకుని పారదర్శకంగా, నిర్ధిష్టంగా నియామకాలు జరుగతయి..విద్యార్థులెవరూ గందరగోళ పడాల్సిన అవసరం లేదు..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రశ్నాపత్రాలు పల్లీ బఠానీలాగా జిరాక్స్ సెంటర్‌లో అమ్మకాలు జరిగినప్పుడు ఉన్న చైర్మన్, మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం…నిర్వహించిన పరీక్షలన్నింటినీ రద్దు చేయడం…రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఉన్నరు..కాబట్టి వాళ్లు ఇప్పటికే గవర్నర్‌కు రాజీనామాలు పంపించారు…నాకు తెలిసి నెక్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకోబోతున్నరు…వారు నిర్ణయం తీసుకున్న వెంటనే వేగంగా కొత్త బోర్డును నియామకం చేపడతాం..చేపట్టిన వెంటనే పోటీ పరీక్షలు నిర్వహిస్తం…పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల ..డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేం రిలీజ్ చేశాము… కచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం…పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతికపరమైన,న్యాయపరమైన అంశాలు పూర్తిగా విశ్లేషించుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News