Monday, December 23, 2024

నాంపల్లి నుంచి కొండమల్లేపల్లికి రెండు వరుసల తారురోడ్డు

- Advertisement -
- Advertisement -

నాంపలి : పూర్వ తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రధాన రహదారి తారురోడ్డు పనులు కానున్నాయి. నాంపల్లి నుంచి తిరుమలగిరి, పసునూరు, మేళ్లవాయి, ఫకీర్‌పురం, సుంకిశాల ముష్టిపల్లి , బండ తి మ్మాపురం, బస్ స్టేజి, రాజ్యాతండా, కొత్తబాయి, కొండమల్లేపల్లి నాగార్జున సాగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిని కలిపే సింగిల్ రోడ్డు వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ అధికారులకు , ప్రజా ప్రతినిధులకు తారు రోడ్డు నిర్మించాలని దశాబ్దాల త రబడి కోరినా పట్టించుకున్న నాధుడు కనిపించలేదు.

మునుగోడు శాసన సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభివృద్ధి ్ద పనులకు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించి , తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు రావడం ,ఆ సందర్భంగా పలువురు బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూ సుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రభుత్వ యంత్రాంగం , ప్రజా ప్రతినిధులు గ్రామా లలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని వాటిని పరిష్కరిస్తామని హామీల వర్షం కురిపించారు.

నాంపల్లి నుంచి కొండమల్లేపల్లి వరకు, మండల కేంద్రంనుంచి పలు గ్రామాలకు లింకు రోడ్లకు 16.8 కి..మీలు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణానికి అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్ధ్థి విజయం సాధించడంతో నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పునః ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా నాంపల్లి నుంచి కొండమల్లేపల్లి వరకు రెండు వరుసల తారురోడ్డు నిర్మాణం పూర్తయితే నాగార్జున సాగర్ హైదరాబాద్ రాష్ట్ర రహదారిని కలిసే అవకాశాలు ఏర్పడి ప్రజా రవాణాకు ఎంతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అదేవిదంగా నాంపల్లి నుంచి బంగారి గడ్డ ద్వారా తాస్కాని గూడెం రెండు వరుసల తారురోడ్డు నిర్మాణం పూర్తయితే ము నుగోడు మండల కేంద్రం ద్వారా హైదరాబాద్, విజయవాడ ప్రధాన రహదారిని అనుసందారం చేయడానికి నార్కెట్‌పల్లి చిట్యాల వద్ద రెండు వరుసల రహదారి కలవడం వల్ల నాంపల్లి ,కొండమల్లేపల్లి, మర్రిగూగెం, గుర్రంపోడ్, చండూరు,గట్టుప్పల్, మునుగోడు , చిట్యాల నార్కెట్‌పల్లి మండలాలకు దూరం తగ్గడంతో పాటు ఇంధన ఖర్చులు తగ్గి ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నాంపల్లి నుంచి చిట్యాల వరకు రెండు వరుసల రోడ్డు వల్ల యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్ జిల్లాలకు మార్గం సుగమం కావుతుంది. తారురోడ్డు నిర్మాణం పూర్తయితే మండలాల మధ్య దూరం దగ్గడంతోపాటు ఇందన పొదుపు జరిగి ప్రజలకు మేలైన రవాణా సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది.

అతుకుల బొతుకులుగా ఉన్న సింగిల్ రోడ్డు మూరెడు గుంతలు ఏర్పడి రాళ్లు తేలి ఎదరుగా వచ్చే వాహనాలను తప్పించుకోవడం కష్టంగా మారి తరుచూ ప్రమాదాలు జరిగి గాయాలు కావడం, మరణించడం జరుగు తోంది. కాగా రెండు వరసల రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇచ్చిన హామీ నెలబెట్టుకోవడంతోపాటు రవాణా సౌకర్యం , ఈ ప్రాంతం సత్వర అభివృద్ధ్ది జరు గుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమా చారం మేరకు శాసన సభ ఎన్నికలకు ముందే రోడ్డు పనులు ప్రారంభం అయ్యే అవ కాశాలు మెండుగా ఉన్నాయి.

రెండు వరుసల రహదారి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ అయినందున టెండర్ పనులు సైతం యుద్ధ్ద ప్రాతిపదికన పూర్తిచేసి పనులు వెంటనే ప్రారంభిస్తే ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగే అవకాశం ఉందని, అధికార పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఎం జరగుతుందో చూడాలిమరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News