- Advertisement -
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు, పోలీస్‌లు పుల్వామా లోని నెహామా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపగా, వారిని ఎదుర్కొని భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈసమయంలో లష్కర్ తొయిబా రెసిస్టాన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు రాయిస్ అహ్మద్, రియాజ్ అహ్మద్‌లు పట్టుబడ్డారు. మే 7న జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
- Advertisement -