Wednesday, January 22, 2025

కశ్మీరులో ఇద్దరు లష్కరే తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two Lashkar-e-Taiba militants killed in Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని షోపియాన్ జిల్లాలో బుధవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు లష్కరే తాయిబా తీవ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. షోపియాన్‌లోని కంజియులర్ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టిన సందర్భంగా తీవ్రవాదులు కాల్పులు జరపినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు లష్కరే తీవ్రవాదులు మరణించినట్లు కశ్మీరు రేంజ్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. మరణించిన తీవ్రవాదులలో ఒకడిని జన్ మొహమ్మద్ లోనెగా గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఇటీవల కుల్గామ్ జిల్లాలో జరిగిన బ్యాంకు మేనేజర్ హత్యతో అతనికి సంబంధం ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News