Thursday, January 23, 2025

కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

బుద్గామ్ : జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ వాహనంలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో జరిగిన ప్రతిదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆ వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు అర్బాజ్ మీర్, షాహిద్ షేక్‌లుగా గుర్తించారు. పుల్వామాకు చెందినట్టు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద కదలికలపై సమాచారం రావడంతో బుద్గామ్‌లో చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News