Monday, December 23, 2024

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two Lashkar Terrorists Killed In Srinagar Encounter

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులను లష్కరేతోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News