Monday, January 20, 2025

రెండు లారీలు ఢీ.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లాలో శు క్రవారం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర మాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తున్న లారీ ముందు వెళుతున్న మరో లారీని ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందా రు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ సంఘటన చేగుంట మం డలం, వడియారం బైపాస్ 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 4 గంటలకు చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన మేకల వ్యాపారులు లారీలో సుమారు 450 మేకలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మహారాష్ట్ర నుండి హై దరాబాద్ వెళ్తున్న మేకల లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల దాణా తీసుకువెళ్తున్న వెళ్తున్న మరో లారీని అతి వేగంగా ఢీకొంది.

ఈ ఘటనలో లారీలో ఉన్న ఎండి ఇబ్రహిం (21), చిక్వా రాజు (57) , చిక్వ మనీష్ (30), ఎండి షబ్బీర్ (48), ఎం డి జిసన్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమేష్, మహేష్, శుక్లాల్, బుట్టాసింగ్, లాల్ మనీలను హైదారబాద్ గాం ధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న సుమారు 100 వరకు గొర్రెలు చనిపోయాయి. తూప్రాన్ డిఎస్‌పి వెంకట్‌రెడ్డి, రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్, చేగుం ట ఎస్‌ఐ బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా మేకలను వేరే లారీలో లోడ్ చేసి లారీలను తొలగించారు. మృతదేహాలను తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News