Thursday, January 23, 2025

రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి

- Advertisement -
- Advertisement -

పెనుబల్లి : మండల పరిధిలోని వియం. బంజర్ శివారులో సప్తపది ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం అర్ధరాత్రి ఖమ్మం నుండి సత్తుపల్లి వెళుతున్న లారీ, సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళుతున్న లారీ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ స్థానంలో ఉన్న ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. వియం. బంజర్ పోలీస్‌లు సుమారు 3 గంటల పాటు శ్రమించి ఇరుక్కుపోయిన డ్రైవర్లను బయటకు తీసి పెనుబల్లి వైద్యశాలకు తరలించారు.

డ్రైవర్లు అప్పటికే మృతిచెందారు. బీహార్‌కు చెందిన ధర్మేందర్ కుమార్ యాదవ్ (50), మహారాష్ట్ర బాలషకు చెందిన సంతోష్ (45)లుగా మృతులను గుర్తించారు. రెండు లారీలు నడి రోడ్డుపై ఢీకొనటంతో రవాణా కొంతసేపు స్థంభించింది. పోలీస్‌ల చొరవతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వియం. బంజర్ ఎస్సై సూరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News