మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మ్యాడ్‘. మోదెల టాకీస్ బ్యానర్‌పై టి.వేణుగోపాల్ రెడ్డి, బి.కృష్ణారెడ్డి, వారి మిత్రులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథతో చూపిస్తూ ‘మ్యాడ్‘చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు లక్ష్మణ్ మేనేని. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న ఈ మూవీ ఆగస్టు 6న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ “జీవితంలో ఎంతో ముఖ్యమైన సందర్భం వివాహం. ఇలాంటి పెళ్లి విషయంలో నేటి యువత చాలా మంది సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే ఎంత స్పీడ్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయో, అంతే స్పీడ్‌గా విడిపోతున్నారు. ఇలా పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో రెండు జంటలు ఎదుర్కొన్న పరిస్థితులను ఆసక్తికరంగా ‘మ్యాడ్’ సినిమాలో చూపించాము”అని అన్నారు.
రెండు జంటల కథ
- Advertisement -
- Advertisement -
- Advertisement -