Monday, December 23, 2024

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బండారు రవి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్రనాయకులు ప్రస్తుతం జరుగుతున్న 19వ సిపిఐ మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో కూంబింగ్‌కు వెళ్ళే పోలీసు పార్టీలను చంపాలనే లక్షంతో కుట్ర పన్ని ప్రెషర్ బాంబ్ తయారీకి కావల్సిన పేలుడు సామగ్రిని కొరియర్‌ల ద్వారా సేకరిస్తున్నారనే పక్కా సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం సిఐ బండారు రవి, వాజేడు ఎస్సై చావళ్ళ వెంకటేశ్వరావు, పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏటూరునాగారం వైపు నుంచి వెంకటాపురం వెళ్ళే ఒక ప్యాసింజర్ ఆటోని తనిఖీ చేయగా ఆటోలోని ఇద్దరు ఒక మహిళ, ఒక మగ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పందగా కనిపించారు.

దీంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా పేలుడు పదార్థ్ధాలైన కార్డెక్స్ వైరు, డిటోనేటర్లు, బ్యాటరీలు, సెల్‌ఫోన్‌లు, నగదు, మెడిసిన్ మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకొని ఇరువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి, రదగంబాల బస్తీకి చెందిన కలువల ఐలమ్మ ల్యాబ్ టెక్నిషియన్ కాగా, మరొకరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మండలం, నాగారం గ్రామానికి చెందిన ఆలూరి దేవేందర్ రెడ్డి లారీ ఓనర్. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ వారికి సహకరించవద్దని, వారితో పాటు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడవద్దని,

మావోయిస్టులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నేరాలకు పాల్పడుతూ అమాయక గిరిజనులను ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని యువత జీవితాలను నాశనం చేస్తున్నారని వారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని నేర కార్యకలపాలకు పాల్పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారి చర్యలు, ఎజెండా వారు మద్దతు ఇస్తున్నట్లు చెప్పుకునే గిరిజన సంఘల శ్రేయస్సు, పురోగతి పట్ల స్పష్టమైన ప్రభావితం చేస్తాయని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News