Saturday, March 1, 2025

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల హతం

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కిష్టారం అడవుల్లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో డిఆర్‌జి, కోబ్రా, సిఆర్‌పిఎఫ్ జవాన్లు సుమారు 500 మంది నాలుగు వైపుల నుంచి కూంబింగ్ మొదలుపెట్టారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు.

ఇరువైపులా కాల్పులు జరగడంతో మావోయిస్టులు పరారయ్యారు. అడవుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం అడవులను జల్లెడ పట్టిన బలగాలకు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు, ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. మృతదేహాలను అడవుల నుంచి తరలిస్తున్నారు. మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. వారిపేర్లను గుర్తించే పనిలో సుక్మా జిల్లా పోలీసులు ఉన్నారు. ఈ యేడాదిలో ఇప్పటి 60 రోజుల్లో 83 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News