Sunday, December 22, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సల్స్‌ హతం

- Advertisement -
- Advertisement -

సుక్మా : చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్‌మెట్ల, డులేద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీస్‌ల జాయింట్ ఆపరేషన్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు చెందిన జాగర్‌గుండ ఏరియా కమిటీ సాయుధ నక్సల్స్ దాదాపు 12 మంది తాడిమెట్లడులేద్ గ్రామాల మధ్య సమావేశమయ్యారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి.

పెట్రోలింగ్ బృందం ఆ ఏరియాను దిగ్బంధం చేయడంతో రెండు వైపులా ఎదురెదురు కాల్పులు జరిగాయి. కాల్పులు ఆగిన తరువాత ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు బయటపడ్డాయి. సంఘటన ప్రాంతం నుంచి 12 బోర్ డబుల్ బ్యారెల్ రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్‌లు చెప్పారు. మృతులు మిలీషియా క్యాడర్ సోధి దేవ, రావా దేవగా గుర్తించారు. వీరిద్దరి తలపై చెరో లక్ష రివార్డు ఉన్నట్టు పోలీస్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News