Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు మావోయిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీస్‌లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ జిల్లా లోని కోయిలిబేడా పోలీస్ స్టేషన్ పరిధి లోని గోమ్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని బస్తర్ ఐజీ పీ. సుందర్‌రాజ్ చెప్పారు. సంఘటన స్థలంలో ఐఎన్‌ఎస్‌ఏ రైఫిల్, 12 బోర్‌రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ నెల 17న కూడా బీజపూర్ జిల్లా మద్దేడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మరణించాడు. మృతుడు మద్దేడు ఏరియా కమిటీ ఇన్‌ఛార్జి, డివిజనల్ కమిటీ మెంబర్ పదం నగేశ్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News