Sunday, December 22, 2024

గంజాయి కొనుగోలు.. ఇద్దరు వైద్య విద్యార్థుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటి బ్యూరో: గంజాయి విక్రయిస్తు న్న యువకుడు, కొనుగోలు చేసిన ఇద్దరు వైద్య విద్యార్థులను సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 80 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, ధూల్‌పేటకు చెందిన సురేష్‌సింగ్ అలియాస్ టీంకు సింగ్ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాల నుంచి గంజా యి విక్రయిస్తున్నాడు. నిందితుడిపై ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ధూల్‌పేట, మంగళ్‌హాట్, టపాచపుత్రలో కేసులు నమోదు చేశారు. ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థులు డాక్టర్ కె.మణికందన్, డాక్టర్ వి. అరవింద్(జూనియర్ డాక్టర్లు)నిందితుడి వద్ద గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. సురేష్ సింగ్ గంజాయి మెడికల్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో నిఘా పెట్టారు.

సురేష్ కోఠికి గంజాయి విక్రయించేందుకు వస్తుండగా ఫాలో అయ్యారు. వైద్య విద్యార్థులకు విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు వైద్య విధ్యార్థుల నుంచి ఎనిమిది నుంచి పది మంది వైద్య విద్యార్థులు గంజాయిని తీసుకుని వాడుతున్నట్లు తెలిసింది. సురేష్ సింగ్ 2016 నుంచి ధూల్‌పేటకు చెందిన దినేష్‌సింగ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే సురేష్ సింగ్‌ను కొందరు మెడికల్ విద్యార్థులు గంజాయి కోసం సంప్రదించారు. అప్పటి నుంచి వారికి గంజాయిని విక్రయిస్తున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజశేఖర్, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News