- Advertisement -
అమరావతి: వదిన, మరిది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్ పేట రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరుణకుమార్, వినయ్ ఏలూరు శివారులోని రైల కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణకుమారిది ఏలూరుగా, వినయ్‌ది రాజమహేంద్రవరంగా గుర్తించారు. ఇద్దరు మధ్య వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -