- Advertisement -
వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూరు శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్-ఖమ్మ జాతీయ రహదారిపై గుర్తు తెలియని లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు పోలేపాక వినయ్ (27), చిన్నపల్లి ప్రదీప్(17)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -