Thursday, April 3, 2025

తెల్లారితే నిశ్చితార్థం…. భవనం కూలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్: భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరుకున్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా మండిబజార్‌లో జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న భవనం పక్కన ఉన్న రేకుల షెడ్డుపై పడడంతో తిప్పారావు పైడి వృద్ధుడు(60), ఫిరోజ్(20) అనే యువకుడు చనిపోయాడు. సలీమా అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్‌కు ఓ యువతి పెళ్లి నిశ్చయం కావడంతో దుస్తువులు కొనడానికి వరంగల్ కు వచ్చారు. శనివారం ఫిరోజ్ కు నిశ్చితార్థం జరగనుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News