Monday, January 20, 2025

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వంతెన రక్షణ గోడకు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓ వైద్యాధికారి మడే రమేష్ తన కుమారుడు సంకల్ప్ తో కలిసి కారులో విశాఖ నుంచి పలాసకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రమేష్ సతీమణి ప్రసన్న లక్ష్మి(40), కూతురు సైర్య(14) ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కారు నడుపుతున్న రమేష్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News