అమరావతి: కృత్రిమ కాలు కలిగిన యువకుడు డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుంటూరు జిల్లా కాకుమామ మండలం రేటూరు గ్రామానికి చెందిన పఠాన్ జాఫర్ సాదిక్(18) దూరపు బంధువుల పెళ్లి కోసం స్నేహితుడి కారు తీసుకొని వెంగళాయపాలెం వెళ్లాడు. పెళ్లిలో రేటూరు గ్రామానికి చెందిన నాగూర్ భాషా(15), పఠాన్ లాలు(19) కలవడంతో వెంగళాయపాలెం నుంచి చిలకలూరు పేటకు ముగ్గురు కారులో బయలు దేరారు. గతంలో రోడ్డు ప్రమాదంలో పఠాన్ కాలు కోల్పోయాడు. పఠాన్ కృత్రిమ కాలుతో కారు డ్రైవింగ్ చేశాడు. వెంగళాయపాలెం గ్రామ శివారులో ఆటోతో పాటో మరో ఎదురుగా రావడంతో కారును డివైడర్‌ను ఢీకొట్టి విగ్రహాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాఫర్ సాదిక్, నాగూర్ బాషా ఘటనా స్థలంలోనే చనిపోయారు. డ్రైవర్ సీట్లో ఉన్న పఠాన్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.