Wednesday, January 22, 2025

శంషాబాద్ లో లారీని ఢీకొట్టిన కారు: అన్నదమ్ములు మృతి

- Advertisement -
- Advertisement -

 

Two Members dead in Car accident

రంగారెడ్డి: లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎలికట్ల చౌరస్తాలోసోమవారం వేకువజామున లారీని వెనక నుంచి కారు  ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసి, శవ పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులు షాద్ నగర్ కు చెందిన అన్నదమ్ములు పవన్, నాగార్జునాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News