Monday, January 27, 2025

కాలువలో పడిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఎస్‌ఆర్‌ఎస్ పి కాలువలో కారు పడిన సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెట్‌పల్లికి చెందిన రేవంత్ తన బంధువు ప్రసాద్‌తో కలిసి టవేరా వాహనంలో సోమవారం అర్థరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సెల్‌నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో స్థానిక పోలీసులకు రేవంత్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా సిసి కెమెరాలు, స్థానికుల సహాయంతో కాకతీయ కాలువలో పడినట్లు గ్రహించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ఉన్నతాధికారులతో కాలువ నీటి ప్రవాహాన్ని తగ్గించడంతో టవేరా వాహనం కనిపించింది. వెంటనే నీటిలో నుంచి వాహనాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని మెట్‌పల్లి సిఐ శ్రీను, ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News