Monday, December 23, 2024

చెరువులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Car fell into lake

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో శుక్రవారం ఉదయం కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఒంటిమిట్ట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లడంతో ఇద్దరు జలసమాధికాగా మరో ఇద్దరు గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఒంటిమిట్ట వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని బయటకు తీయడంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును నీళ్లలో నుంచి బయటకు తీశారు. కారులో నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News