Wednesday, January 22, 2025

చౌటుప్పల్ లో కంటెయినర్ ఢీకొని: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Container accident

యాదాద్రి భువనగిరి: డిసిఎంకు బ్రేక్ విఫలం కావడంతో మరమ్మతులు చేస్తుండగా కంటెయినర్ ఢీకొట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డిసిఎం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద బ్రేక్ విఫలంకావడంతో రోడ్డు పక్కన ఆపారు. డిసిఎం వాహనానికి మెకానిక్ తో మరో ఇద్దరు మరమ్మతు చేస్తుండగా కంటెయినర్ అతి వేగంగా బస్సును ఓవర్ టేక్ చేసి వారిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా మరొకరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News