Sunday, December 22, 2024

మెదక్ లో విషాదం… తండ్రి అస్తికలు… శవమైన తేలిన కుమారులు

- Advertisement -
- Advertisement -

ఘనపూర్: మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా సరిహద్దులో కామారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామమునకు చెందిన హర్యా, బాల్ సింగ్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తండ్రి అస్తికలు గంగలో కలపడానికి వచ్చారు. ఇరువురు పోచమ్మరాల్ వద్ద అస్తికలు కలపడానికి నీటిలో దిగడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలానికి హవేళి ఘనపూర్ ఎఎస్ఐ రాజు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News