Sunday, January 19, 2025

వినాయక చవితి వేళ విషాదం…. ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రదేశాలలో వినాయక మండపాలు నిర్మిస్తుండగా కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దూలపల్లిలో గణేషుడి మండపం వద్ద విద్యుత్ ఘాతంలో నవీన్ అనే యువకుడు చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటీలోని టివిఎస్ షోరూమ్ వెనుక వీధిలో వినాయక మండపం నిర్మిస్తుండగా కరెంట్ తీగలు తగలడంతో మహేష్ అనే బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులుు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయకుడు మండపం వద్ద కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు స్థానిక లైన్ మెన్, ఎలక్ట్రీషీయన్ సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వినాయకుడు మండపం వద్ద అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News