Tuesday, January 21, 2025

గోడ కూలి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Law student brutally murdered in Meerut

అమరావతి: గోడ కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాం గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… కుమారం గ్రామంలో పెంకుటింట్లో అడ్డాల లక్ష్మి(47) తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో గోడలు పూర్తిగా తడిసిపోయాయి. ఇంట్లో ఐదుగురు నిద్రిస్తుండగా గోడ కూలిపోవడంతో అడ్డాల లక్ష్మి(47), అశోక్ కుమార్ రాజు(5) ఘటనా స్థలంలోనే చనిపోయారు. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News