Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదం… కాళ్ల పైనుంచి బస్సు వెళ్లడంతో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో కాళ్లు విరిగిపోయాయి. ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్లో వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News