హైదరాబాద్: సహజీవనం చేస్తున్న ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిలా ఆదిభట్ల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… సరస్వతి (30) అనే మహిళ 15 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ముగ్గురు కుమార్తెలు, కుమారుడితో ఒంటరిగా ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సాదుల మహేందర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు మధ్య పరిచయం సహజీవనానికి దారితీసింది. సరస్వతి పుట్టింటి వారు హెచ్చరించినప్పటికి అతడిని పెళ్లి చేసుకున్నానని, సంసారం చేస్తున్నానని చెప్పింది. సరస్వతి, మహేందర్ మధ్య గొడవలు జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. వారం రోజుల తరువాత ఆమె మహేందర్ ఇంటికి వెళ్లింది. లెనిన్ నగర్‌లోని రాజీవ్ స్వగృహ కల్పనలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలపడంతో ఎస్‌ఐ లక్ష్మినారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మహేందర్ ఉరి వేసుకున్నాడని సరస్వతి శవం నేలపై పడి ఉందని పోలీసులు తెలిపారు. సరస్వతి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను చంపేసిన తరువాత అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఏమైందో ఏమో కానీ… సహజీవనం చేస్తున్న ఇద్దరు ఆత్మహత్య?
- Advertisement -
- Advertisement -
- Advertisement -